సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో ట్రెండ్.. వాట్సాప్ స్టేటస్లలో పాతకాలపు ఫోటోల హోరు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో పందొమ్మిది వందల ఎనభైల నాటి ఫ్యాషన్, హెయిర్స్టైల్, సన్గ్లాసెస్, పాతకాలపు సినిమా లుక్తో రూపొందించిన ఫొటోలు తీవ్రంగా ట్రెండ్ అవుతున్నాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో పాతకాలపు హీరోల మాదిరిగా మార్చి పలువురు తమ వాట్సాప్ స్టేటస్లు, సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. చాట్జీపీటీ ఏఐ ఫోటో ఎడిటింగ్ ద్వారా ఆధునిక ఫొటోలను పాతకాలపు వాతావరణంలోకి మార్చడం వైరల్గా మారడంతో యువత ఈ ట్రెండ్పై విశేష ఆసక్తి చూపుతున్నారు.