అనకాపల్లి రాజకీయం హీట్: సీఎం రమేష్ సవాల్పై గుడివాడ అమర్నాథ్ కౌంటర్

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య మాటల యుద్ధం ముగిసిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుందని Vizag News వెల్లడించారు. నిన్న చోడవరంలో జరిగిన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ను జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి గెలవాలని సీఎం రమేష్ సవాల్ విసిరారు. ఈ సవాల్ను సీరియస్గా తీసుకున్న గుడివాడ అమర్నాథ్ వెంటనే సీఎం రమేష్కు దీటుగా కౌంటర్ సవాల్ విసురుతూ రాజకీయంగా తీవ్ర సవాల్ ప్రతిసవాల్లకు తెరలేపడంతో స్థానికంగా ఈ అంశం హాట్టాపిక్గా మారింది.