యూఎస్ ఓపెన్‌లో గంజాయి వాసనతో సబలెంకకు తీవ్ర ఇబ్బంది
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆర్యనా సబలెంకకు వింత అనుభవం ఎదురైంది. మూడో రౌండ్ మ్యాచ్ సందర్భంగా కోర్టులో గంజాయి వాసన రావడంతో ఆమె అసహనానికి గురయ్యారు. వెంటనే అంపైర్‌కు ఫిర్యాదు చేసి, ఆ వాసనతో ఆడటం కష్టమని తెలిపారు. ఈ ఘటనపై టోర్నీ నిర్వాహకులు స్పందిస్తూ, స్టేడియం వెలుపల జరిగే వాటిపై నియంత్రణ లేదని, అయితే లోపల కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.