నాపై రియల్ ఎస్టేట్ ఆరోపణలు అవాస్తవం: సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ వేదికగా తనపై వస్తున్న రియల్ ఎస్టేట్ అక్రమాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ధనార్జనే ధ్యేయమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, వ్యాపారంలోనే వేల కోట్లు సంపాదించేవాడినని స్పష్టం చేశారు. ప్రజాసేవ కోసం మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు మాని వాస్తవాలు తెలుసుకోవాలని సభలో హితవు పలికారు.