ఉపాధ్యాయ దినోత్సవం: గురువులే విద్యార్థుల విజయానికి మార్గదర్శకులు!
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మార్కండేయ నగర్లోని జేబీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కళాశాల ప్రిన్సిపాల్ గంగాపురం జంగయ్య మాట్లాడుతూ, విద్యార్థుల విజయానికి గురువులే మార్గదర్శకులని అన్నారు. విద్యార్థులు తమ గురువులను సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.