కడెం : ఇది వర్షాకాలమా... ఎండాకాలమా?
రిపోర్టర్: Radha. A
స్థలం: కడెం
కడెం: ఇది వర్షాకాలమా... ఎండాకాలమా అన్నట్లుగా కడెం మండల కేంద్రంలోని మార్కెట్లో వాతావరణం కనిపించింది. వర్షాకాలంలో కనిపించే గొడుగులు ఎండ తీవ్రత కారణంగా మార్కెట్లో దర్శనమిచ్చాయి.
భానుడి భగభగలకు తట్టుకోలేక కూరగాయల వ్యాపారులు గొడుగులు పట్టుకుని వ్యాపారం సాగించారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో మార్కెట్లో కూరగాయలు విక్రయించే వ్యాపారులు గొడుగుల నీడను ఆశ్రయించారు. దీంతో కడెం మార్కెట్లో ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు పట్టుకుని కూరగాయలు అమ్ముతున్న దృశ్యాలు కనిపించాయి.
ఎండాకాలంలో సహజంగా కనిపించాల్సిన ఈ దృశ్యాలు వర్షాకాలంలో కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.