విజయవాడలో వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయవాడ
విజయవాడ చిట్టినగర్‌లో వినాయకచవితి అన్నదాన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. కేఎల్‌రావునగర్‌కు చెందిన మద్ది సుజాత అనే 46 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు వేడి సాంబార్ ఉన్న గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.