భక్తిశ్రద్ధలతో రికార్డు ధర పలికిన గణేశుని దివ్య లడ్డూ ప్రసాదం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

చిట్వేల్ మండలం కందులవారిపల్లి గ్రామంలో తొలిసారిగా అత్యంత వైభవంగా నిర్వహించిన వినాయక లడ్డూ వేలంపాటలో యువకుడు కందుల రోహిత్ రూ.71,116 భారీ ధర వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు. అనంతరం లడ్డూను డీజే పాటల హోరులో గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగించి, భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. దేవుని కృపతోనే తనకు ఈ అవకాశం దక్కిందని, తన సంపాదనలో కొంత దేవుడికి కేటాయించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని రోహిత్ హర్షం వ్యక్తం చేశారు.