బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు: చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ నిప్పులు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

బీసీ రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు నూటొక్క డ్రామాలు ఆడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైకోర్టు జీవోలను కొట్టివేసిన నేపథ్యంలో బీసీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన మార్గాలు వెతక్కుండా రాజకీయ స్వార్థం కోసం చెల్లని జీవోలతో బీసీలను మోసం చేస్తున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు.