టీమిండియాకు భారీ షాక్: తొలి టెస్టుకు రిషబ్ పంత్ దూరం
రిపోర్టర్: విజయ్
స్థలం: బెంగళూరు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్ తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. గతంలో పక్కటెముకల గాయానికి గురైన అతను బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో పునరావాసం పొందుతున్నాడు. అయితే ఆదివారం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో పంత్ విఫలమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతనికి మరోసారి ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలోనూ నెగ్గకపోతే సిరీస్ నుంచి తప్పించే ఛాన్స్ ఉంది.