'రూ.10 ఓపీతో కార్పొరేట్ వైద్యం': తెలంగాణ ప్రజలకు బీబీనగర్ ఎయిమ్స్ వరం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Bibinagar
తెలంగాణలో పేద, మధ్యతరగతి ప్రజలకు బీబీనగర్ ఎయిమ్స్ ఒక వరంలా మారిందని, కేవలం రూ.10 ఓపీ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందుతోందని తెలిపారు. సుమారు రూ.1400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ అత్యాధునిక ఆసుపత్రి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని వెల్లడించారు.