రాజాంలో మహిళ జేఈ సంచలన హత్య: భర్తే చంపాడని తండ్రి ఫిర్యాదు

రిపోర్టర్: కృష్ణ స్థలం: రాజాం

విశాఖకు చెందిన లలితకుమారి చీపురుపల్లిలో ఈపీడీసీఎల్ జేఈగా విధులు నిర్వహిస్తుండగా రాజాంలో దారుణ హత్యకు గురయ్యారని సీఐ నవీన్కుమార్ తెలిపారు. ఈ ఘాతుకానికి వినియోగించిన గొడ్డలిని కోనేరులో క్లూస్టీం గుర్తించిందని ఆయన వెల్లడించారు. తోటి ఉద్యోగులతో కలిసి పనిచేస్తుండడాన్ని సహించలేక భర్త సీతారామరాజు అనుమానంతోనే హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.