హైదరాబాద్ ప్రజలకు తీపి కబురు: మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాసులు ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మరియు ఆర్టీసీ బస్సుల్లో సులభంగా ప్రయాణించడానికి ఉమ్మడి పాస్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్ వేదికగా ఉమ్మడి పాస్లతో పాటు మీ టికెట్ యాప్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ నూతన విధానం ద్వారా రోజువారీ మరియు నెలవారీ పాస్లను పొందవచ్చని, ప్రయాణికులకు రవాణా కష్టాలు తొలగిపోతాయని అధికారులు వెల్లడించారు. నగరవాసులకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.