అన్నదాతలకు భారీ ఊరట: తప్పుల తడకగా ఉన్న పాస్పుస్తకాలకు స్వస్తి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వే రైతన్నలకు తీవ్ర శాపంగా మారింది. హడావిడిగా పొలం కొలతలు వేయడంతో పట్టాదారు పాసుపుస్తకాలు పూర్తిగా తప్పులతడకగా మారాయి. సర్వే నంబర్లు, విస్తీర్ణంలో తేడాలు రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ భూమి-మీ హక్కు పథకం కింద పొరపాట్లను సరిచేసి, రాజముద్రతో కూడిన కొత్త పాస్పుస్తకాలను పంపిణీ చేస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.