సాగునీటిని నిలిపివేస్తే ఊరుకోబోమంటూ తిమ్మాపూర్ లో రైతన్నల గర్జన

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని తిమ్మాపూర్ రాంపూర్ చౌరస్తా వద్ద రైతులు సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. పంటలు చేతికి వస్తున్న సమయంలో సాగునీటి విడుదలను ఆపడం సరికాదని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జాడి గంగాధర్ మండిపడ్డారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సై ఉదయ్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.