సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

భారత టీ20 జట్టులో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడం తన కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన నిర్ణయమని, ఆ రాత్రి తాను నిద్రపోలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, సంజుతో తాను నిజాయితీగా మాట్లాడానని జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నారు.