జాతీయ రహదారుల పక్కన నిర్మాణాలపై ఎన్హెచ్ఏఐ కఠిన నిబంధనలు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల పక్కన ఇళ్లు లేదా వ్యాపార షాపులను నిర్మించేవారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, కాలుష్య నియంత్రణ మరియు రోడ్డు విస్తరణను దృష్టిలో ఉంచుకుని రహదారి మధ్యరేఖ నుంచి గ్రామీణ ప్రాంతాలలో నలభై మీటర్లు, పట్టణ ప్రాంతాలలో ముప్పై మీటర్ల దూరం వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని అధికారులు హెచ్చరించారు.