ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు: సాంకేతికత హంగులతో భక్తులకు మెరుగైన సేవలు
రిపోర్టర్: గోపి
స్థలం: Vijayawada
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సాంకేతికత హంగులతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌తో పాటు ఆన్లైన్ టికెట్లను ఆయన ఆవిష్కరించారు. రద్దీ నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక క్యూఆర్ బ్యాండ్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.