తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా కేసులో కైలాష్‌చంద్‌ మాంగ్లా అరెస్టు

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన కైలాష్‌చంద్‌ మాంగ్లాను హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని విశాఖలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. వైకాపా హయాంలో తితిదేకు రూ.96 కోట్ల విలువైన నకిలీ నెయ్యిని ఆయన సరఫరా చేసినట్లు ఈడీ వెల్లడించింది.