మన్ననూరు రైతు వేదికలో ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అచ్చంపేట
అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేత్ బచావో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్ నీనో ప్రభావంతో తగినంత వర్షపాతం నమోదు కాక నష్టపోయిన రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించనున్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని మినుములు, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కీలక సూచనలు చేయనున్నారు. ఈ అవకాశాన్ని మండల రైతులందరూ సద్వినియోగం చేసుకుని లాభపడాలని వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు.