యువత దేశానికే గొప్ప నిధి అని ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉద్బోధ

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా మకవరపాలెంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల పరిచయ వేదిక మరియు ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.వి.ఆర్. రాజు, ప్రత్యేక అతిథిగా షఫీ ఖాన్ పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సును పరిమితికి మించి వాడడం వల్ల మానవ మేధస్సు దెబ్బతింటుందని, విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రముఖులు హితవు పలికారు.