నాగినేనిప్రోలు పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహణ
రిపోర్టర్: రాము
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బానోత్ సరోజ విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత, పరిసరాల శుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చతికించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.