రామాయణం సినిమాపై ఫైసల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు: రెండో భాగంలో మరిన్ని విజువల్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: Mumbai

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో కుంభకర్ణుడిగా నటిస్తున్న ఫైసల్ మాలిక్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో ఊహించని స్థాయిలో అద్భుతాలు ఉంటాయని, మొదటి భాగం కంటే రెండో భాగంలో మరిన్ని విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని ఆయన తెలిపారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.