గెడ్డల ఆక్రమణలతో రెండు వేల ఎకరాల్లో మునిగిన పంటలు

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

సంతకవిటి, రేగిడి మండలాల్లో సాయన్న, బద్దెగెడ్డల ఆక్రమణలతో కాలువలు కుచించుకుపోయి రెండు వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆక్రమణల తొలగింపునకు రూ.14 కోట్ల ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ఏటా వర్షాలొచ్చినప్పుడల్లా వేల ఎకరాల్లో పంట నష్టం వస్తోందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.