ఇడుపు కాయితం సినిమా శ్రీలత పాటకు అద్భుతమైన స్పందన

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

ప్రియదర్శి హీరోగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇడుపు కాయితం సినిమాలోని శ్రీలత పాటకు ప్రేక్షకుల నుంచి సూపర్ స్పందన వస్తోంది. బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, అలరాజు సాహిత్యం సమకూర్చారు. ఈ పాటలో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. తెలంగాణ ఫోక్ స్టైల్ లో సాగే ఈ మెలొడియస్ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.