భారీ షాక్: భారతీయ మార్కెట్ల నుంచి వెనక్ కి వెళ్లిన విదేశీ పెట్టుబడులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అక్టోబర్ నెలలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలిపోయాయని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ డేటా స్పష్టం చేసింది. ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల ప్రభావం వల్ల ఈ ఉపసంహరణ జరిగిందని ఆనంద్ కె రాఠీ తెలిపారు. ఈ పరిణామంతో ఈ ఏడాది మొత్తం విదేశీ పెట్టుబడుల అమ్మకాలు రెండు లక్షల తొంబై ఐదు వేల కోట్లకు చేరాయి.