సౌదీ అరేబియాతో 5 బిలియన్ డాలర్ల భారీ ఆయుధ ఒప్పందం

రిపోర్టర్: సురేష్ స్థలం: World

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, సౌదీ అరేబియాకు 5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా బాంబులు, గైడెన్స్ కిట్‌లు, సాంకేతిక పరికరాలను సరఫరా చేయనున్నారు. ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు సౌదీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ డీల్ కుదిరింది. ఇప్పటికే అణు ఇంధన సహకారంపై కూడా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.