ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: మంగళగిరి

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 తొలి సీజన్ సెప్టెంబర్ 19 నుంచి మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ లీగ్‌కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా, వైజాగ్ ఫైర్ బర్డ్స్, అమరావతి ఈ ఛాంపియన్స్, రాయలసీమ ఎక్స్‌ఈఎన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ అనే నాలుగు జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.