ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని తెలిపారు. జిల్లాలో సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ సేవలు వంటి సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు.