రూ.82 కోట్లతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.82 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. నాలుగు వరుసలుగా, సెంట్రల్ లైటింగ్‌తో ఈ రోడ్డును నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కోకాకోలా పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.