నేషనల్ హైవేలపై భారీ టోల్ గేట్ల ఏర్పాటుకు ఇక భూసేకరణ అవసరం లేదు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

జాతీయ రహదారులపై కొత్త టోల్ గేట్ల ఏర్పాటుకు ఇకపై ఎలాంటి అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్ హెచ్ ఏ ఐ స్పష్టం చేసింది. భవిష్యత్ లో చేపట్టే అన్ని హైవే ప్రాజెక్టుల్ లో మల్టీ లేన్ ఫ్రీ ఫ్ లో విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓవర్ హెడ్ గ్యాంట్రీలపై ఎలక్ట్రానిక్ పరికరాలు ఏర్పాటు చేయడం ద్వారా టోల్ వసూలు సులభతరం కానుందని వెల్లడించారు.