హృదయాలను హత్తుకుంటున్న బ్లింకిట్ డెలివరీ బాయ్స్: గాయపడిన కుక్కపిల్లకు పునర్జన్మ

రిపోర్టర్: రమేష్ స్థలం: ముంబై

ముంబైలో కారు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడిన ఒక కుక్కపిల్లను బ్లింకిట్ డెలివరీ బాయ్స్ ప్రాణాలతో కాపాడినట్లు ప్రొఫెషనల్ రోషన్ మాత్రే లింక్డ్ఇన్ వేదికగా వెల్లడించారు. స్థానిక వేర్హౌస్లో ఆ ప్రాణికి వైద్యం అందించిన డెలివరీ భాగస్వాములు, కోలుకున్న తర్వాత దానిని తమతోపాటే ఆర్డర్లు అందించేందుకు తీసుకెళ్తున్నారు. ఈ మానవతా దృక్పథాన్ని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.