మంగంపేటలో సనాతన ధర్మ పరిరక్షణకు కదంతొక్కిన సమరసత సేవ ఫౌండేషన్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుంచి ప్రతినిధులు ఉత్సాహంగా హాజరై ఆలయాల కేంద్రంగా సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు.