కరెంట్ తీగ రూపంలో ముంచిన మృత్యువుతో అక్కాచెల్లెలు దుర్మరణం

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరంలోని హరనాథపురంలో బంధువుల ఇంటిపై ఆడుకుంటుండగా విద్యుదాఘాతంతో జ్యోతి, అమూల్య అనే అక్కాచెల్లెలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సెలవుదినం కావడంతో తల్లిదండ్రులు పనులకు వెళ్లగా, పిల్లలు ఇంటిపైకి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. నీటి ట్యాంకు సమీపంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగ తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే కుమార్తెలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.