ఉపా కేసులో సంచలనం: ప్రశ్న రావణ్ దర్యాప్తు గడువు పొడిగింపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: కృష్ణా జిల్లా

ప్రశ్న రావణ్పై నమోదైన ఉపా కేసు దర్యాప్తు గడువును మరో ముప్పై రోజులు పొడిగిస్తూ కృష్ణా జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించారు. రావణ్పై నమోదైన ఈ కేసులో చట్ట ప్రకారం నిర్ణయించిన తొంభై రోజుల కాలపరిమితి ముగియనుండటంతో, విచారణను మరింత లోతుగా నిర్వహించేందుకు ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం గడువును పొడిగించింది.