శివుడు రాముడిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం
రిపోర్టర్: శివ
స్థలం: ఢిల్లీ
దేశంలో ఆర్య ద్రావిడ భావనలు శివుడు శ్రీరాముడి ప్రస్తావనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేం ద్రావిడులం శివ భక్తులమని ఇక్కడి ప్రజలు ఆర్యులు శ్రీరాముడి భక్తులని అభివర్ణించారు. శివుడిని పేదల దేవుడిగా రాముడిని ధనవంతుల దేవుడిగా పోల్చడంపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా మండిపడింది. హిందువులను ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రకు తెరతీసిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ధ్వజమెత్తారు.