గుర్గావ్‌లో మహిళా బైకర్‌పై కారుతో దాడి, భయానక అనుభవం పంచుకున్న బాధితురాలు

రిపోర్టర్: హరి స్థలం: Haryana

గుర్గావ్‌ గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డులో కారుతో తన బైక్‌ను ఢీకొట్టిన ఘటనపై మహిళా బైకర్‌ సియా సంచలన విషయాలు వెల్లడించారు. కారులోని నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు ముఖ కవళికలను బట్టి స్పష్టంగా తెలిసిందని ఆమె తెలిపారు. తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ప్రమాదానికి గురిచేశారని, భయంతో తాను తీవ్రంగా వణికిపోయానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.