డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లోకి స్టార్ రెజ్లర్ బేలీ గ్రాండ్ రీఎంట్రీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ బేలీ దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టారు. వీఐపీ షోలో భాగంగా మండే నైట్ రా కార్యక్రమంలో ఆమె సంచలన రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి లీరా వల్కైరియాతో తన పాత వైరాన్ని మరోసారి గుర్తుచేస్తూ ఆమెపై విరుచుకుపడ్డారు. బేలీ రాకతో ఆమె కంపెనీ వీడుతుందన్న వదంతులకు పూర్తిగా తెరపడింది.