అంతరిక్ష కక్ష్యలో ఆయుధాలు మోహరించిన అమెరికా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమెరికా

అంతరిక్ష యుద్ధ భయాలను నిజం చేస్తూ భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో తమ ఆయుధాలను మోహరించినట్లు అమెరికా అధికారికంగా అంగీకరించింది. మిత్రదేశాల ఉపగ్రహాలు, అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికే ఈ స్పేస్ కంట్రోల్ వెపన్స్‌ను పంపినట్లు యుఎస్ ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రోయ్ ధృవీకరించారు. రష్యా, చైనా వైఖరిని ముప్పుగా భావిస్తున్న అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో అంతరిక్షంలో ఆధిపత్య పోరు తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.