ఖమ్మంలో ఆసుపత్రుల తనిఖీ నిర్వహించిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం

ఖమ్మంలోని శ్రీమంతా, సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను డీఎంహెచ్ఓ డాక్టర్ డి. రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రికార్డులు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. నిబంధనల ప్రకారం అనుమతులు, అర్హత పత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఉల్లంఘనలు ఉంటే చర్యలు తప్పవని తెలిపారు.