నెల్లూరులో స్పందన కార్యక్రమం: ఎస్పీకి అందిన నూట అరౖ ఒక్క వినతులు
రిపోర్టర్: సతీష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అజిత వేజెండ్లకు ప్రజల నుండి భారీగా వినతులు అందాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు తమ సమస్యలను అధికారుల ముందుంచారు. ఈ కార్యక్రమంలో మొత్తం నూట అరవై ఒక్క అర్జీలు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు. చట్ట పరిధిలో విచారించి ప్రతి బాధితుడికి త్వరలోనే న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.