సీతారాంపురంలో ఎంపీపీ నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ రవిచంద్ర
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సీతారాంపురం
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం పోకలవారిపల్లి గ్రామంలో ఎంపీపీ చింతల శ్రీను నివాసానికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విచ్చేశారు. ఈ సందర్భంగా పొలంగారిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిశారు. అనంతరం ఎంపీపీ చింతల శ్రీను, జెడ్పీటీసీ రత్తయ్యలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల రాకతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది.