తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపుపందిరి వాహనంపై సీతారాముల అలంకారంలో శ్రీవారు
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సీతా స్వయంవర ఘట్టాన్ని తలపిస్తూ స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో విహరించడం విశేషంగా నిలిచింది. ఈ వాహనసేవలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి శ్రీవారికి అత్యంత వైభవంగా గరుడ వాహనసేవ జరగనుంది.