ఘంటసాల మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన జె సత్యవతి
రిపోర్టర్: రమేష్
స్థలం: ఘంటసాల
కృష్ణా జిల్లా ఘంటసాల మండల ప్రత్యేక అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత ఎంపీపీ వేమూరి రజనీ కుమారి పదవీకాలం ముగియడంతో ఈ మార్పు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి.సుబ్బారావు, మండల పరిషత్ సూపరింటెండెంట్ లలితి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని నూతన అధికారిని ఘనంగా సత్కరించారు. పరిపాలనా పరమైన మార్పుల్లో భాగంగా ఈ నియామకం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.