నారాయణవనం మండలంలో దారుణంగా దెబ్బతిన్న గ్రామీణ తారు రోడ్లు
రిపోర్టర్: User
స్థలం: నారాయణవనం
తిరుపతి జిల్లా నారాయణవనం మండలం అరణ్యకండ్రిగ పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలకు వెళ్లే తారు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్షం పడితే నీరు నిలిచి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిగువ సుబ్బానాయుడు కండ్రిగ, ఎగువ సుబ్బానాయుడు కండ్రిగ, ఆదిఆంధ్రవాడ గ్రామాలకు వెళ్లే ఈ రహదారిని వెంటనే బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.