మేడిగడ్డ కూలిపోయిందన్న ప్రచారం పచ్చి అబద్ధమంటూ వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జయశంకర్ భూపాలపల్లి
మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోన్న ప్రచారం పచ్చి అబద్ధమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతల బృందంతో కలిసి ఆయన శనివారం మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజ్ చెక్కుచెదరకుండా నిలబడి ఉందని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారానికి తెరలేపిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.