ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను అందరం సాధించాలి

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిషత్ ఆవరణలో స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ నాయకులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, చేనేత సంఘం అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.