పాలకుల నిర్లక్ష్యపు నీడలో బాలికల హాస్టల్ భద్రత
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి విషసర్పాలు సంచరిస్తుండటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో జనసేన మండల అధ్యక్షుడు పెనుమాక ప్రసాద్ రంగంలోకి దిగారు. ఆయన చొరవతో హాస్టల్ ఆవరణలోని పిచ్చి మొక్కలకు గడ్డి మందు పిచికారీ చేయించి విద్యార్థినులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయించారు.