కొల్హాపూర్‌కు ఏనుగు మాధురి తిరుగుపయనం, పూర్తి వైద్య సహాయం అందిస్తామన్న వంతారా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు 36 ఏళ్ల మాధురి (మహాదేవి) ఏనుగు తిరిగి పయనమైంది. సుప్రీంకోర్టు, హై-పవర్డ్ కమిటీ ఆదేశాల మేరకు జామ్‌నగర్‌లోని వంతారా కేంద్రం నుంచి మాధురిని కొల్హాపూర్‌కు తరలిస్తున్నారు. ఏనుగు ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తామని, వైద్య సహాయం అందిస్తామని వంతారా స్పష్టం చేసింది. ఊరేగింపుల్లో వాడవద్దని, ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కమిటీ నిబంధనలు విధించింది.