డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమంటూ సోమిరెడ్డి సవాల్

రిపోర్టర్: మహేష్ స్థలం: Amaravati

డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన అక్రమాస్తులు, వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును నిజమని ఒప్పుకుంటేనే డీఎస్సీపై విచారణ జరిపిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందని, నిరుద్యోగుల అవకాశాలను జీర్ణించుకోలేకనే ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ దురుద్దేశంతో బురదజల్లుతోందని సోమిరెడ్డి మండిపడ్డారు.